Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు ఈరోజు (నవంబర్ 28) బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 10:57 సమయంలో ఈ- మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందజేసింది.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ లాగానే భారత విదేశాంగ విధానం కూడా ఉందన్నారు. పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్తో పోల్చారు.
Sambhal Mosque Survey: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో గల షామీ జమా మసీదు కమిటీకి భారీ ఊరట లభించింది. సంభాల్ మసీద్ వివాదంపై విచారణకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. లోక్ సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతునే ఉంది. నాలుగోరోజైన ఈరోజు (నవంబర్ 29) కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, లోక్సభ మధ్యాహ్నం వరకూ వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా సోమవారాని(డిసెంబర్ 2)కి వాయిదా పడింది.
Karnataka BJP: కర్ణాటక భారతీయ జనతా పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీలో అంతర్గత విభేదాలతో బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ఇది కారణం అయి ఉండొచ్చని సమాచారం.
మహారాష్ట్ర సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు కొనసాగాయి.. ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
Air Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తీవ్ర వాయు కాలుష్యంతో ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి ముంబై కూడా చేరినట్లైంది. గత కొన్ని రోజులుగా దేశ ఆర్థిక రాజధాని నగరంలో గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణ వేత్తలు, ముంబై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హింసాత్మాక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీల్లో నేటి (నవంబర్ 29) నుంచి రెగ్యులర్ తరగతులు పునఃప్రారంభించబోతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.