Karnataka BJP: కర్ణాటక భారతీయ జనతా పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీలో అంతర్గత విభేదాలతో బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ఇది కారణం అయి ఉండొచ్చని సమాచారం. కాగా, ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి బసంగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్ గా ఏర్పడిందని సమాచారం. ఇక, తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read Also: ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
అయితే, బసంగౌడ్ పాటిల్ యత్నాల్ కామెంట్స్ పై కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పార్టీ హైకమాండ్ తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో అంతర్గత పోరు కన్నడ నాట పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన బై పోల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మూడు స్థానాల్లో శిగ్గావ్, సండూరు, చెన్నపట్నలలో హస్తం పార్టీ నేతలు విజయ దుందుభి మోగించారు. మూడు చోట్లా బీజేపీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో రెండు వర్గాల మధ్య కొత్త వార్ స్టార్ట్ అయింది.