భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారానే విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అయితే, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫొటోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Fengal Cyclone : గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఫెంగల్.. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
అయితే, దీనికి బీజేపీ ఎంపీ కంగన రనౌత్ ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు. ఆమె ప్రధాని భద్రతా బృందం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌లో సభ్యురాలే అయి ఉండొచ్చని నెటిజన్లు చర్చ పెట్టారు. దీంతో ప్రధాని మోడీ భద్రత వలయంలో మహిళా కమాండో ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఫోటో వైరల్ కావడంపై భద్రతా వర్గాలు స్పందించాయి. ప్రస్తుతం ఎస్పీజీలో 100 మంది మహిళా కమాండోలు ఉన్నారు.. అలాగే, మరి కొందరు మహిళా ఎస్‌పీజీ కమాండోలు ‘క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్’లో సభ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు.
Read Also: Manipur Violence: 13 రోజుల విరామం తర్వాత.. మణిపూర్‌లో నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు రీఓపెన్
కాగా, ఈ చిత్రంలో కన్పించిన మహిళ మాత్రం ఎస్‌పీజీ టీమ్ లో భాగం కాదని క్లారిటీ ఇచ్చాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేటాయించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని పేర్కొన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లో అసిస్టెంట్ కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఇక, ఆమె పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారిక వర్గాలు వెల్లడించలేదు.