నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని అందులో కోరారు. కాగా, షాహీ జామా మసీదు కమిటీ వేసిన పిల్ ను ఈరోజు (నవంబర్ 29) సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమావేశం అయ్యారు. పొరుగు దేశంలోని పరిస్థితులపై ఈ భేటీలో ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు బంగ్లాదేశ్తో పాటు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలపై రేపు (నవంబర్ 29) జైశంకర్ పార్లమెంట్లో వివరించనున్నారు.
INS Arighaat: భారత్కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. విశాఖ తీరంలో భారత నౌకాదళం దీనిని నిర్వహించిందని రక్షణ రంగ అధికారులు చెప్పారు. అరిఘాత్ నుంచి కే4 క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి.
మహారాష్ట్ర మంత్రి మండలిలో గరిష్ఠంగా 43 మంది మంత్రులను నియమించుకునే ఛాన్స్ ఉంది. ఇందులో 20కి పైగా పదవులను భారతీయ జనతా పార్టీ తీసుకునేందుకు మహాయుతి కూటమి నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు ఓ ఇంగ్లీష్ మీడియా కథనాలు ప్రచురించింది. శివసేన(షిండే)కు 13, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 క్యాబినెట్ సీట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరితే తనపై ఎలాంటి కేసులు, నిషేధాలు ఉండవని చెప్పుకొచ్చారు. వేధింపులకు గురైన మహిళలకు, అన్నదాతల పోరాటానికి సపోర్టుగా నిలిచిన నాటి నుంచే మోడీ సర్కార్ తమను టార్గెట్ చేసిందని బజరంగ్ పూనియా పేర్కొన్నారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి ఒక రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ కనిపిస్తుంది. ఈరోజు ( నవంబర్ 28) ఉదయం మరోసారి హస్తినలో కాలుష్య స్థాయి ఏక్యూఐ 300కి చేరిపోయింది.
Crime News: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన లివింగ్ ఇన్ పార్ట్నర్ను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత శరీరాన్ని 40 నుంచి 50 ముక్కలుగా నరికిన ఘటన.. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
Israel: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, మాజీ రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈక్రమంలోనే ఆ అరెస్టు వారెంట్ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ నుంచి తరలించే అవకాశం ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను నిర్ణయించేందుకు వర్చువల్ సమావేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఏర్పాటుకు ఒక రోజు ముందు ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.