శివసేన (షిండే) వర్గం తోసిపుచ్చింది. ఎన్డీయే అధిష్ఠానం నిర్ణయంపై ఏక్ నాథ్ షిండే కలత చెందలేదని.. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారని వెల్లడించింది. అందుకే తన స్వగ్రామం సతారాకు వెళ్లినట్లు తెలిపారు.
Fire Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 200 బైక్స్ కాలి బూడిదయ్యాయి. ఈ రోజు (నవంబర్ 30) తెల్లవారుజామున ఈ ఘటన నెలకొంది.
పుదుచ్చేరి, తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, మైలాడుతురై జిల్లాల్లో ఈ రోజు మూతపడ్డాయి.
Israel–Hamas war: ఈజిప్టు రాజధాని కైరోలో ఈ రోజు (నవంబర్30) ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ గ్రూప్ తెలిపింది.
కీ బోర్డు పైన వరుసలో మొదట Q, W, E, R, T, Y, U, I, O, P అనే అక్షరాలు ఉంటాయి. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి తయారు చేశారట. ఇక, అంతకు ముందు A, B, C, D వరుసగా ఉన్న కీబోర్డుపై ఆయన కొన్ని పడిన ఇబ్బందులను గమనించి.. ఇంగ్లీష్ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువ సార్లు, మరికొన్ని అతి తక్కువగా ఉపయోగిస్తుంటాం.
శుక్రవారం జరిగిన అత్యవసర భేటీలో హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ ని నిర్వహించడం తప్ప పాక్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. అలా కుదరదంటే మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను మరో దేశానికి ఇచ్చేస్తామని స్పష్టం చేసింది. హైబ్రిడ్ పద్ధతికి సుముఖంగా ఉంటేనే ఈ రోజు (నవంబర్ 30)పీసీబీతో సమావేశం జరిపి షెడ్యూల్‌ను ఖరారు చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భావిస్తుంది.
Russia Ukraine War: రష్యా దూకుడుగా దాడి చేస్తుండటంతో ఉక్రెయిన్ సైనికులు డీలా పడ్డారు. దీంతో రేపోమాపో కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు మొదలైతే ఉక్రెయిన్ రష్యాతో గట్టిగా బేరమాడలేని స్థితిలోకి జారిపోతుంది.
దేశ భద్రతా వ్యవహారాలపై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్ కన్వెన్షన్ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు. ఈ సదస్సులో ఈరోజు ( నవంబర్ 30) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.