Margani Bharat: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు మ్యాటర్ ఎక్కువ.. మీటర్ తక్కువ అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలకు అనుగుణంగా బడ్జెట్ ఎందుకు రూపొందించలేకపోయారు అని ప్రశ్నించారు. గత బడ్జెట్లో ప్రవేశ పెట్టిన అన్నదాత సుఖీభవ పథకంలో 20 వేల రూపాయలు రైతులందరికీ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేశారు. 50 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందించాలంటే 11 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.. మీరెంత కేటాయించారు అని మాజీ ఎంపీ భరత్ అడిగారు.
Read Also: CPM Raghavulu: డీలిమిటేషన్‌పై అమిత్ షా వ్యాఖ్యలు మోసపూరితం
ఇక, తల్లికి వందనం పథకంలో భాగంగా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితియ సంవత్సరం స్టూడెంట్స్ వరకు ఉన్న 87 లక్షల మంది విద్యార్థులకు .. 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని మాజీ ఎంపీ భరత్ రామ్ అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం 9400 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.. ఎవరికి కోత విధిస్తారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.. నిరుద్యోగ భృతి ఎక్కడ.. దావోస్ లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడులు సాధించారా అని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం 61 ఎంవోయూలు చేసుకుంది.. పక్కనే తెలంగాణలో 20 ఎంవోయూలు చేసుకున్నారు.. 1,61,000 కోట్లు రూపాయలు పెట్టుబడి సాధించారు అని మార్గాని భరత్ రామ్ అన్నారు.