వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ పెరిగింది. ఏకంగా అరడజన్ మంది ఆశావహులు జిల్లా కాంగ్రెస్ పీఠంపై కన్నేసి గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. రాష్ట్ర మంత్రులు ఇద్దరి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలున్న వనపర్తి డిసిసి పీఠం కోసం ఒకరకంగా హోరాహోరీ పొలిటికల్ పోరు నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
HYDRA: వర్షాల వేళ.. నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. నాలా ఆక్రమణలను ప్రత్యక్షంగా చూసి వెంటనే తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నదీ పరీవాహకం కంటే.. ఎక్కువ కూకట్పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఈ సందర్భంగా మార్చరీలో ఉన్న మృతదేహాలకు వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ చేసి అప్పగిస్తున్నారు. అయితే, ఈ రోజు మరో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు.
KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు డాక్టర్లు పలు పరీక్షలు చేస్తున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. గతంలోనూ కేసీఆర్ అనారోగ్య సమస్యతో యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.
Group-1 Exam: గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు.
Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎల్లుండే పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శనివారం నాడు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి.. ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
Telangana Govt: అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడి టీచర్లుగా ప్రమోషన్ పొందే హెల్పర్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం వల్ల 45 ఏళ్లు దాటిన హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది.
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు.
Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని ఫార్మా కారిడార్ లోని పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో సుమారు 45 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. అయితే, పేలుడు ధాటికి ఘటన స్థలంలో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతాం.. హరీష్ రావు, కేటీఆర్ తో మాకు సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.