HYDRA: వర్షాల వేళ.. నగరంలోని పలు ప్రధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. నాలా ఆక్రమణలను ప్రత్యక్షంగా చూసి వెంటనే తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నదీ పరీవాహకం కంటే.. ఎక్కువ కూకట్‌పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు నాలాలు సాఫీగా సాగకపోవడంతో భరత్‌నగర్, మూసాపేట, బాలానగర్, జింకలవాడ, దీన్‌దయాల్‌నగర్, వినాయక్‌నగర్, కల్యాణ్ నగర్ ప్రాంతాలు నీట మునుగుతున్నాయని.. ఈ ఏడాది ముప్పు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నాలాలు పొంగకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. నాలాలకు ఉన్న ఆటంకాలన్నీ తొలగితే చాలా వరకు ముంపు సమస్య ఉందని రంగనాథ్ వెల్లడించారు.
Read Also: Indian defence: రూ. 1 లక్ష కోట్ల క్షిపణులు, ఆయుధాల కొనుగోళ్లకు ఆర్డర్..
ఇక, జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ నుంచి వచ్చే వరద కాలువ ఎక్కడిక్కడ ఆక్రమణలకు గురై కుంచించుకుపోయినట్లు గుర్తించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఫాక్స్ సాగర్ అలుగు కాలువ ఆనవాళ్లే లేకుండా పోయింది. జీడిమెట్ల ప్రాంతంలో ఆ కాలువ 30 మీటర్ల వెడల్పులో ఉంటే.. కల్వర్టుల వద్ద ఉన్న వెడల్పు కాలనీలు, బస్తీలకు వచ్చేసరికి లేకుండా పోయింది.. బాలానగర్, జింకలవాడ, దీన్‌దయాల్‌నగర్ కల్వర్టు కింద 22 మీటర్లు వెడల్పుతో ఉన్న నాలా.. బస్తీలకు వచ్చేసరికి 10 మీటర్లకే పరిమితమైంది అన్నారు. వాస్తవానికి 22 మీటర్ల వెడల్పు, నాలకు ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్‌ని కలిపి మొత్తం 40 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన నాలా 10 మీటర్లకు పరిమితం అవ్వడంతోనే ఫతేనగర్, బాలానగర్ బస్తీలన్నీ నీట మునుగుతున్నాయని వెల్లడించారు. వెంటనే జీడిమెట్ల నుంచి వచ్చే ఈ నాలాను డ్రోన్ కెమేరాతో పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. ఫాక్స్‌సాగర్ చెరువు కింద నాలాలో పోసిన మట్టిని వెంటనే తొలగించాలని చెప్పారు.
Read Also: Ameerkhan : ‘కూలీ’లో అమీర్ ఖాన్.. ట్విస్ట్ ఇస్తారా..?
అయితే, అల్వాల్ మండలం యాప్రాల్ లో నాగిరెడ్డి కుంట కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆరా తీశారు. దాదాపు 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు 6 ఎకరాల వరకూ కబ్జాకు గురైందన్నారు. చెరువు గర్భంలో పోసిన మట్టిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగిరెడ్డి కుంట నుంచి కాప్రా చెరువుకు వెళ్లాల్సిన వరద కాలువలు ఎక్కడికక్కడ కబ్జాలకు గురి కావడంపై మండిపడ్డారు. కొన్ని చోట్ల నాలాలకు ఏర్పడిన ఆటంకాలను తనిఖీ చేశారు. గోల్ఫ్ ప్రై డ్ హోమ్స్, మల్బార్ గీన్స్ విల్లాస్, హరిప్రియనగర్, గోల్ఫ్ వ్యూ ప్యారడైజ్, స్వర్ణాంధ్ర ఫేజ్ 01, 02 ఇలా పలు గేటెడ్ కమ్యూనిటీలలో వాగులు రూటు మారడాన్ని, కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడటంతో పాటు నాలా ఆరంభంలో ఎంత వెడల్పులో ఉందో.. కాప్రా చెరువులో కలిసే వరకూ అదే కొనసాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడి వివిధ కాలనీ వాసులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి.. గతంలో నాలాలు ఏ మార్గంలో వెళ్లేవి.. ఇప్పుడు వాటిని పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు.