CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు. ఇక, మలబార్ తయారీ యూనిట్ ను మహేశ్వరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించబోతున్నామని తేల్చి చెప్పారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: AP High Court: వైఎస్ జగన్ భద్రతపై పిటిషన్.. హైకోర్టులో కీలక వాదనలు
ఇక, మహేశ్వరంలో ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదు.. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళుతున్నాం అని చెప్పుకొచ్చారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. వారికి లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై నమ్మకం ఉంచిన మలబార్ గ్రూప్ కు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్.