Industrial Tragedy: సిగాచి ఫ్యాక్టరీలో బ్లాస్ట్.. ఈరోజు 13 మృతదేహాలు బంధువులకు అప్పగింత
- సిగాచి ఫ్యాక్టరీ పేలుడు.. ఈ రోజు మరో 13 మృతదేహాలు గుర్తింపు..
- మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ. 1 లక్ష చొప్పున అందిజేత..
- మృతదేహాలను ఈ రాత్రికే స్వస్థలాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Industrial Tragedy: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పేలుడు ధాటికి పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి. చెల్లాచెదురుగా పడిపోయిన సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఈ సందర్భంగా మార్చరీలో ఉన్న మృతదేహాలకు వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ చేసి అప్పగిస్తున్నారు. అయితే, ఈ రోజు మరో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు. దీంతో మృతదేహాల గుర్తింపు సంఖ్య ఇప్పటి వరకు 31కి చేరింది. ఇక, తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు ఇచ్చి.. ఈ రాత్రికే మృతుల స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మార్చురీలో 7 మృతదేహాలు ఉండగా.. గుర్తు పట్టలేని స్థితిలో మరికొన్ని అవయవాలు, మాంసపు ముద్దలు దర్శనమిస్తున్నాయి.
Read Also: UP News: ఆహారంలో ఉప్పు ఎక్కువైందని గర్భిణీ భార్యపై భర్త దాడి.. మృతి..
Also Read
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
- TGSPDCL : విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
మరోవైపు, సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో కంపెనీ యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది. నిన్న 40 మంది మృతి చెందారని ప్రకటన ఇచ్చి.. ఇప్పుడు 38 మంది మృతి చెందారని మరో ప్రకటన రిలీజ్ చేసింది. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న 33 మందిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. డిశ్చార్జ్ అయిన వారి వివరాలు మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!