Off The Record: పేరుకు చిన్న జిల్లా అయినా.. రాజకీయం యమా రంజుగా జరుగుతోందా? నా మనిషికే డీసీసీ పీఠం కావాలంటూ.. ఇద్దరు కాంగ్రెస్ పెద్దలు ఢీ అంటే ఢీ అంటున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసం ఇప్పట్నుంచే పోటా పోటీ వ్యూహాలు పన్నుతున్నారా? ఎవరా ఇద్దరు కాంగ్రెస్ నేతలు? ఏ జిల్లాలో అంత రసవత్తర రాజకీయం జరుగుతోంది?
Read Also: Bengaluru: ఎక్ట్రా కప్పు ఇవ్వనందుకు కాఫీ షాప్ సిబ్బందిని చితకబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్
వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ పెరిగింది. ఏకంగా అరడజన్ మంది ఆశావహులు జిల్లా కాంగ్రెస్ పీఠంపై కన్నేసి గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. రాష్ట్ర మంత్రులు ఇద్దరి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలున్న వనపర్తి డిసిసి పీఠం కోసం ఒకరకంగా హోరాహోరీ పొలిటికల్ పోరు నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తమ వర్గీయులకు ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పావులు కదుపుతుండటంతో ఎపిసోడ్ రక్తికడుతోంది. ఉమ్మడి పాలమూరులోని 15 మండలాలతో ఏర్పాటైన చిన్న జిల్లా వనపర్తి . ఇందులో పూర్తి స్థాయి వనపర్తి నియోజక వర్గంతో పాటు, మక్తల్ సెగ్మెంట్‌లోని ఆత్మకూరు, అమరచింత మండలాలు , కొల్లాపూర్ నియోజకవర్గంలోని పానగల్, చిన్నంబావి , వీపనగండ్ల మండలాలు, దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాలు ఉన్నాయి.
Read Also: Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!
అయితే, వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యేగా మంత్రి వాకిటి శ్రీహరి , కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మరో మంత్రి జూపల్లి ఉన్నారు. వీరికి తోడు వనపర్తికే చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ప్లానింగ్ కమిటి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఉండటం, అంతా కాంగ్రెస్ ప్రముఖులే కావడంతో.. డీసీసీ అధ్యక్ష ఎంపిక ఆసక్తికరంగా మారిందంటున్నారు. ఎంపిక విషయంలో వీరంతా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. కానీ, మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. మేఘారెడ్డి, చిన్నారెడ్డి మాత్రం తమ వర్గీయులకే ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారట.అయితే.. ప్రస్తుతం వనపర్తి డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ యాదవ్. ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త డిసిసి నియామకం ఉంటుందన్న సమాచారంతో అరడజను మందికి పైగా ఆశావహులు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వనపర్తి పట్టణానికి చెందిన లక్కాకుల సతీష్, వెంకటేష్, న్యాయవాది కిరణ్, ఖిల్లాఘనపురం మండలానికి చెందిన సాయిచరణ్, గోపాల్ పేట మండలానికి చెందిన సత్య శీలా రెడ్డి , వనపర్తి మాజీ ఎంపిపి కిచ్చారెడ్డి డీసీసీ పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.
Read Also: Ameerkhan : ‘కూలీ’లో అమీర్ ఖాన్.. ట్విస్ట్ ఇస్తారా..?
ఇక, ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కూడా ఎక్స్‌టెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో సతీష్ , వెంకటేష్ , సాయిచరణ్ , సత్యశీలా రెడ్డి, కిచ్చారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం కాగా … రాజేంద్రప్రసాద్ , కిరణ్ కు చిన్నారెడ్డి మనుషులుగా పేరుంది. ఈ క్రమంలో…. తన మనిషికే ఇప్పించుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పలువురి పేర్లతో పాటు , సామాజిక సమీకరణాల లెక్కల్ని కూడా వివరించినట్టు సమాచారం. మరో మూడు నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే పదవి దక్కుతుందంటూ… వనపర్తి కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో చిన్నారెడ్డి కూడా తగ్గేదే లే అంటున్నారట. అయితే… ఇక్కడ ఇంకో కొత్త లెక్కను తెర మీదికి తెస్తోంది ఎమ్మెల్యే వర్గం. ప్రస్తుతం చిన్నారెడ్డి వర్గీయుడైన రాజేంద్రప్రసాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి.. ఈసారి తమ వర్గానికి ఇవ్వాలన్నది మేఘారెడ్డి శిబిరం డిమాండ్. మొత్తం మీద చిన్న జిల్లా అధ్యక్ష పీఠం కోసం పెద్ద రాజకీయమే నడుస్తోందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.