ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణలో కీలక అంశాలు ప్రస్తావించారు. అప్పటి మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ తెలిపారు. HMDW ఖాతా నుంచి FEO కంపనీకి నిధులు మల్లింపుపై నా ప్రమేయం ఆయన లేదని తేల్చి చెప్పారు.
Kakatiya University: వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగాయి. రిజిస్టర్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా లెటర్ రాసిందా, జాగృతి నాయకురాలుగా రాసిందా అని ప్రశ్నించారు. మేము బీసీల కోసం వాగ్దానం చేసిన రోజు కవిత తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అని ఎద్దేవా చేశారు.
అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో సంక్షోభం.. ఒకవైపు సొంత కూతురు ధిక్కార స్వరం, మరోవైపు మేనల్లుడు హరీష్రావు అలక. ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కొడుకు కేటీఆర్ ఏసీబీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇలా ఎటు చూసినా కేసీఆర్కు ఇబ్బందికర పరిస్థితులే. ఆయనకున్న నమ్మకాల కోణంలో చెప్పాలంటే.. గ్రహాలు కలిసిరాలేదు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల పొలిటికల్ హాట్ టాపిక్. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఒకే తాను ముక్కలుగా అభివర్ణిస్తూ.. ఇద్దర్నీ ఏక కాలంలో టార్గెట్ చేస్తోంది తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. కార్పొరేషన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవుల రేసులో నిలిచినా.. వీళ్ళకు ఆ ఒక్కటి అడ్డొస్తోందట. ఎక్కడికెళ్లినా ఆ తప్పునే గుర్తు చేస్తూ.. ఇద్దరికీ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నాయకులు.
Pakistan YouTube Ban: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు అన్నింటినీ భారత దేశంలో బ్యాన్ చేసింది.
Microsoft Layoffs: టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు తెలుస్తుంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ పెద్ద మొత్తంలో లేఆఫ్లు ప్రకటించడం ఇది సెకండ్ టైమ్.
Imran Khan: పాకిస్తాన్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. ఈ బానిసత్వాన్ని తాను అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతానని రాసుకొచ్చారు.
Workplace Harassment: బెంగళూరు నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన కలకలం రేపుతుంది. సోమవారం నాడు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లో ఈ దారుణం చోటు చేసుకుంది.