Rajnath Singh: చాలా మంది యోధులు చిన్న వయసులోనే స్వాతంత్ర్య కోసం ప్రాణాలు వదిలారు అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలు వదిలారు.. భారత స్వాభిమానం, తెలుగు రాష్ట్రాల గుర్తుగా నిలిచిపోయారు.
Harish Rao: పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04/07/2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని పేర్కొన్నారు.
అధికారులను పంపించి ముగ్గు వేయించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు ఎలా క్యాన్సల్ చేస్తారని ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసిన శ్రీరాములపేటలో ఇప్పటి వరకు ఎందుకు ఇందిరమ్మ డబ్బులు ఇవ్వలేదని అడిగారు. దళిత బంధు వచ్చిన దళితులకు ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు ఇవ్వరు.. ఎన్నికల మేనిఫెస్టోలో దళిత బంధు వచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని చెప్పారా సమాధానం ఇవ్వాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Telangana CM: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయం సమరభేరి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధ పడకండి.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు.
CM Revanth Reddy: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవిగిన కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి కొట్టింది మీరు.. ఇదే వేదిక నుంచి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకున్నాం.. ప్రతీ గుండె తడుతూ పరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.
Kharge Slams BJP: పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించింది.. కానీ, బీహార్ ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. నరేంద్ర మోడీకి దేశ భద్రతపై లేదని విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా అందరూ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. తెలంగాణలో కులగణన.. దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు.
Election Commission: తెలంగాణ రాష్ట్రంలోని 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ. సుధర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Kharge Serious On MLAs: హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీరియస్ అయ్యారు.
రేవంత్ రెడ్డి డిమాలిషన్ మాన్, ఇపుడు డైవర్షన్ మాన్ అని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లీజుపై రేవంత్ ఎన్నో మాట్లాడారు.. ఇపుడు ఏమీ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ హై కమాండ్స్ ఎప్పుడో ములాఖత్ అయ్యాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలకి కాకుండా బీజేపీకి ఓటు వేయాలని బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు.