శ్రీశైలం డ్యామ్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి.. అయితే, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు..
Srisailam Project: శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణుడు, రిటైర్డ్ ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఈరోజు (జూలై 6) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా చెక్ చేశారు.
HYD: నేడు వనమహోత్సవం -2025 కార్యక్రమం. ప్రొ.జయశంకర్ వర్సిటీ ప్రాంగణంలో మొక్కను నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000,18 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,600 లుగా ఉంది. అలాగే కిలో వెండిధర రూ. లుగా ఉంది. 1,11,100 తిరుపతి: నేడు ఇందిరా మైదానంలో బీసీల ఆత్మ గౌరవ సభ. హాజరుకానున్న రాష్ట్ర బిసి మంత్రులు అనగాని సత్యప్రసాద్,…
అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. సాయంత్రం 4:50 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరనున్న జగన్.. రాత్రి 7:10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. రాత్రి 7.40 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్న జగన్.. నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 1,56,554 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : నిల్. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు.…
శ్రీశైలం జలాశయం.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో చాలా కీలకం. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయందే సింహభాగం. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్తక సాధక ప్రాజెక్టు శ్రీశైలం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 2009లో ప్రమాదంలో పడింది.
శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుధాలతో అర్ధరాత్రి సమయంలో మాక్ డ్రిల్ నిర్వహించింది.. రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి.. చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం జలాశయంపై ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు.
కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి.. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి.. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు.. మరోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది.. దీంతో.. శ్రీశైలం జలాశయం గేటును ఎత్తారు అధికారులు.. ఈ సంవత్సరంలో ఇది ఐదోవసారి రేడియల్ క్రెస్టు గేట్ ఎత్తడం విశేషంగా చెప్పుకోవాలి.. జలాశయం 1 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో 93,270 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌లో చేరుతుండగా.. 1 గేటు 10 అడుగుల మేర ఎత్తి 95,626 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల…
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.