శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.. దీంతో.. మరోసారి గేట్లు తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.. కాసేపట్లో రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు.. అయితే, ఇన్ ఫ్లో రూపంలో 2,13,624 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌లో వచ్చి చేరుతుంది..
Beautiful View of Srisailam Dam in Night: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. మంగళవారం వరకు 5 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో ఐదు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తంగా 10 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ప్రవహిస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి…
శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు కాసేపటి క్రితం ఎత్తేశారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 3 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.67,210 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సమయం రానేవచ్చింది.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సాయంత్రం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.. ఇప్పటికే జలాశయానికి గంటగంటకు పెరుగుతోంది వరదప్రవాహం.. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర రివర్ నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి శ్రీశైలంలో చేరుతోంది..
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వచ్చి చేరుతుంది దీనితో ఇవాళ గేట్లు ఎత్తి దిగివకు నీటిని విడుదల చేయనున్నారు మంత్రి అంబటి రాంబాబు
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది.. 4,66,864 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా… కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఔట్ ఫ్లో 62 వేల క్యూసెక్కులుగా ఉంది.. డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 879.30 అడుగులకు చేరింది… పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, ఇంకా భారీగానే…