Huge Devotees in Srisailam Temple on the occasion of Karthika Masam 2023: కార్తికమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఉత్తర మాఢవీధి పూర్తిగా కార్తిక దీపారాధనలతో వెలిగిపోతుంది. కార్తికమాసం, అంద�
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం కార్తీక మాసోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు.. కార్తీకమాసం నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు అధికార, అర్చకులతో సోమవారం రోజు సన్నాహక సమావేశం నిర్వహించారు.
చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.
శ్రీశైలం ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము సంచరిస్తుండడం కలకలం రేపింది. ఇవాళ్టి నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శివాజీ గోపురాన్ని ముస్తాబు చేస్తున్న లైటింగ్ సిబ్బంగికి నాగుపాము కనిపించింది.
శ్రీశైలంలో ఈనెల 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు జరగనున్నాయి. దసరాకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి కల్పిస్తామని శ్రీశైలం ఆలయ ఈవో వెల్లడించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈనెల 18 నుండి 27 వరకు వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రత్నగర్భగణపతి, సాక్షిగణపతికి, పంచలోహమూర్తికి వ్రతకల్ప విశేషార్చనలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.
Cheetas Roaming In Andhra Pradesh : గత కొన్ని రోజులుగా తిరుమలలో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం అధికారులు ఆపరేషన్ చిరుత కూడా చేపట్టి చిరుతల్ని పట్టుకున్నారు. తాజాగా అలిపిరి నడకమార్గం నరశింహస్వామి ఆలయ సమీపంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో రెండు చిరుతలను అధికారుల�
Huge Fire Accident in Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్లో అర్ధరాత్రి దాటాక ఎల్ బ్లాక్ సముదాయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ�