Minister Roja: బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోకు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా వెళ్లాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా కూడా అన్‌స్టాపబుల్ షో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని ఉందని.. ఎందుకంటే బాలయ్యతో తాను ఏడు సినిమాలు చేశానని.. తమ జోడీది హిట్ కాంబినేషన్ అని రోజా చెప్పారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబుతో బాలయ్య అన్‌స్టాపబుల్ షో చేసిన తర్వాత.. అది చూశాక తన మనసు మార్చుకున్నాని రోజా తెలిపారు. తమకు దైవం లాంటి ఎన్టీఆర్ గురించి బాలయ్య ఫూల్‌ను చేసే విధంగా మాట్లాడారని రోజా ఆరోపించారు. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడవటం కరెక్ట్ అని.. ఎన్టీఆర్ మంచోడు కాదని. .అందుకే ఆయన్ను దించేశామని వాళ్ల బావ చంద్రబాబుకు సపోర్ట్ చేసే విధంగా బాలయ్య మాట్లాడటం తనకు నచ్చలేదని రోజా చెప్పారు.
Read Also: Minister Roja: హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో..?
ఎన్టీఆర్ గారు బతికి ఉన్నప్పుడు బావ వెన్నుపోటు పొడుస్తుంటే చూస్తు ఉండిపోయిన బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత వాళ్ల నాన్నను చంపేసే విధంగా షో నిర్వహించడం కరెక్ట్ కాదని మంత్రి రోజా అన్నారు. అందుకే తన వరకు అయితే అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని లేదని స్పష్టం చేశారు. అటు పవన్ కళ్యాణ్ యువశక్తి, లోకేష్ యువగళం పాదయాత్రల గురించి కూడా రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన ప్రభుత్వం వచ్చినప్పుడు.. యువకులకు ఏం చేశారని.. అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని రోజా ప్రశ్నించారు. అప్పుడు సెంట్రల్‌లో, స్టేట్‌లో తాను చెప్పింది వినే ప్రభుత్వాలు ఉన్నా ఏం చేయలేని పవన్ ఇప్పుడు యువత గురించి ఏం మాట్లాడతారని ఆమె నిలదీశారు. అటు ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ యువతకు చేసిందేమీ లేదన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల్లో సెక్రటేరియట్ ఉద్యోగాలు కల్పించామని.. టీడీపీ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదో చెప్పిన తర్వాతే లోకేష్ పాదయాత్ర చేస్తే బాగుంటుందని రోజా అన్నారు.