Minister Roja: మినిస్టర్ రోజా.. జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఒకరి మీద ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువశక్తి సభలో పవన్.. రోజాను డైమండ్ రాణి అనడం, పవన్ అభిమాని హైపర్ ఆది.. మంత్రులకు శాఖలు కూడా తెలియదు అనడం రెండు తెలుగు రాష్ట్రాలను హీట్ ఎక్కించాయి. ఇక ఈ వ్యాఖ్యలపై రోజా సైతం ఘాటుగా స్పందిస్తూ.. పవన్ ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు వద్ద నుంచి కలక్షన్స్ తీసుకోవడానికి వెళ్లాడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా జగన్ ప్రభుత్వం మంచి చేసింది కాబట్టే తాము గెలిచామని, మరి ఇప్పటివరకు పవన్ ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలవలేదని ప్రశ్నించింది. ఇక నాగబాబు అన్న మాటలకు కూడా ఆమె తనదైన రీతిలో స్పందిస్తూ సమాధానం చెప్పుకొచ్చింది.
Dil Raju: ఏయ్.. ఏయ్.. దిల్ రాజు.. పెన్ అడిగి పాపను పడేసావే.. ఆహా
ఇక తాజాగా హైపర్ ఆది యువశక్తి సభలో అన్న వ్యాఖ్యలపై రోజా మాట్లాడుతూ.. “పాపం చిన్న ఆర్టిస్టులు.. చిన్న చిన్న షోలు. పాత్రలు చేసుకొనేవారు.. వారిపై ఎందుకు ఈ ప్రతాపాలు.. వారి వెనుక ఎవరు ఉండి ఇవన్నీ అనిపిస్తున్నారో వారిని అనాలి. ఇలాంటి సభలో చిన్న చిన్న ఆర్టిస్టులను పిలిచి మాట్లాడించుకొనే పరిస్థితికి పవన్ దిగజారిపోయాడు. వారు కూడా మెగా కుటుంబంతో ఎక్కడ విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో వారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడి, వారి వెంటనే ఉంటామని చెప్పుకొస్తున్నారు. అది ప్రేమ కాదు భయం. ఎక్కడ మమ్మల్ని లేకుండా చేస్తారేమో అన్న భయంతో మాట్లాడుతున్నారు. ఇక వారు కూడా కొద్దిగా ఏం మాట్లాడుతున్నారో అర్ధం చేసుకుంటే బావుంటుంది. మంత్రులకు అసలు శాఖలే తెలియవు అని అంటే.. శాఖలు తెలియకుండానే మంత్రులు ఎలా అయ్యాం. సరే.. సినిమావాళ్ళు.. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శారద, నేను.. మమ్మల్ని గెలిపించిన జనం.. వారిని ఎందుకు గెలిపించలేకపోతున్నారు. ఎందుకంటే.. ప్రజలకు మేము ఎంతో కొంత మంచి చేశాం.. అది కనిపించి మమ్మల్ని గెలిపించారు. ప్రజలు ఏం తెలివితక్కువ వాళ్ళు కాదు.. వాళ్ళు చాలా తెలివైనవాళ్లు.. వారికి తెలుసు.. ఎవరు ఎలాంటివారో.. మనమేం చెప్పనవసరం లేదు” అంటూ రోజా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.