Purandeswari: కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గం ముళ్ళపూడి గ్రామంలో నిర్మించనున్న సిటిజన్స్ ఫోర్స్ కేన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వర్చువల్ గా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా తల్లిగారు బసవరామ తారకం లింఫోమా కేన్సర్ కు బలైపోయారు అని ఆవేదన చెందింది. ఆ తరువాత బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలందిస్తున్నాం.. కేన్సర్ బాధితులకు సరైన వైద్యం అందించే పరిస్ధితులు అప్పట్లో లేవు.. ఇటీవల కేన్సర్ ప్రబలి పోతోంది.. మన దేశంలో ప్రతీ లక్షకు 9 మంది కేన్సర్ బారిన పడుతున్నారు.. వైద్యానికి అయ్యే ఖర్చు బయట నుంచి తెచ్చే అప్పు కట్టలేక ప్రజలు పేదరికం బారిన పడుతున్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి పేర్కొనింది.
Read Also: Rythu Mahotsavam 2025: 3 రోజుల పాటు కొనసాగనున్న రైతు మహోత్సవం.. 150 స్టాల్స్ ఏర్పాటు!
ఇక, వైద్య సౌకర్యాలు పట్టణాలకు కేంద్రీకృతం అవుతున్న సమయంలో గ్రామీణ ప్రాంతంలో ఈ సౌకర్యాలు పెరగాలి అని ఎంపీ పుంధేశ్వరి తెలిపింది. మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు ఎక్కువైపోతున్నాయి.. కేన్సర్ తగ్గించడమే కాకుండా, కేన్సర్ రోగి బాధను తగ్గించాలి అన్నారు.. కేన్సర్ కేర్ సెంటర్లు ప్రతీ జిల్లాలో స్థాపించాలని కేంద్రం నిర్ణయించింది.. కరోనా తరువాత కేన్సర్, కిడ్నీ వ్యాధులు పెరిగిపోయాయి.. ప్రభుత్వాలు చాలా చేస్తాయి.. మారుమూల ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ప్రభుత్వాలకు ఉండదు అని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించింది.