Breast cancer: కొన్ని దశాబ్దాల క్రితం వరకు రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా తక్కువగా ఉండేవి. వచ్చినా ఎక్కువగా 60 ఏళ్లు దాటిన మహిళల్లో కనిపించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కేసులు పెరగడమే కాకుండా, ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలు కూడా దీని బారిన పడుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు అనేక కారణాలు ఉన్నప్పటికీ, కొన్ని పరిశోధనల్లో కాస్మొటిక్ ఉత్పత్తులు కూడా ఈ వ్యాధి…
'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని తెలిసినా.. చిన్నా పెద్దా తేడా లేదు మందు తాగేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే మద్యానికి అడిక్ట్ అయిన కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఆల్కహాల్ తీసుకుంటుంటారు. వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్‌ను పట్టించుకోకుండా.. ఒకట్రెండు పెగ్గులేగా ఏం కాదులే అనుకుంటారు. కానీ.. ఇటీవల మద్యంపై డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక విడుదల చేసింది.
క్యాన్సర్ అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను 'కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా,…
ఇటీవల కేన్సర్ ప్రబలి పోతోంది.. మన దేశంలో ప్రతీ లక్షకు 9 మంది కేన్సర్ బారిన పడుతున్నారు.. వైద్యానికి అయ్యే ఖర్చు బయట నుంచి తెచ్చే అప్పు కట్టలేక ప్రజలు పేదరికం బారిన పడుతున్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి పేర్కొనింది.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి…
ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శాస్త్రవేత్తలు ఒకే డోస్‌తో బ్రెస్ట్ క్యాన్సర్ ట్యూమర్‌లను తొలగించవచ్చని పేర్కొన్నారు. దీంతో ఒక్క డోస్‌తో ఈ వ్యాధికి చికిత్స చేయాలనే ఆశ పెరిగింది. యుఎస్‌లోని అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ERSO-TFPY అనే అణువు యొక్క మోతాదును అభివృద్ధి చేశారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నేడు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సంయుక్త పాల్గొంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న ఆమె సేవా కార్యక్రమాల్లో సైతం ముందు ఉంటుంది.
Usha Lakshmi: ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కొత్త ఉషాలక్ష్మి కన్నుమూశారు. గుండెపోటుతో మంగళవారం రాత్రి ఆమె కన్నుమూశారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె వయసు 91 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన డాక్టర్ ఉషాలక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గైనకాలజిస్టుల్లో ఒకరు. ఆవిడ గైనకాలజీ ప్రొఫెసర్‌గా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో సుదీర్ఘకాలం సేవలందించారు. అయితే ఆమెకు 69 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఉషాలక్ష్మి ఆ వ్యాధికి ఎదిరించి ధైర్యంగా నిలబడ్డారు.…
Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది చాలా మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కేసులు రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఈ క్యాన్సర్ పురుషులలో కూడా సంభవించవచ్చు, కాకపోతే దీని ప్రమాదం మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2020లో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి సంబంధించిన 2 మిలియన్ కేసులు పైగా నమోదయ్యాయని, దీని కారణంగా దాదాపు 7 లక్షల మంది మహిళలు మరణించారు.…
The Health Effects of Drinking Alcohol Especially in Women: మద్యం తాగడం విషయానికి వస్తే, చాలా మందికి ప్రతికూల ఆరోగ్య ప్రభావాల గురించి తెలుసు. అయితే, ఈ ప్రభావాలు మహిళల్లో మరింత స్పష్టంగా కనిపిస్తాయని గ్రహించకపోవచ్చు. మహిళలు పురుషుల కంటే భిన్నంగా మద్యం ప్రభావాలను అనుభవిస్తారు. ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు ఎక్కువ ప్రమాదానికి దారితీస్తుంది. మహిళల ఆరోగ్యంపై మద్యం తాగడం వల్ల కలిగే ప్రభావాన్ని, అలాగే వివిధ ఆరోగ్య ప్రభావాలను ఒకసారి చూద్దాం.…