అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయని ఎంపీ పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. స్థిరమైన అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ చర్యలు లాంటి రంగాలలో అణు విజ్ఞానం, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అణు విద్యుత్ పరిశోధనలలో భారతదేశం సాధించిన పురోగతి అసాధారణమైనదని అన్నారు.
ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నారీమణులను వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జేపీ నడ్డా వారసుడిగా తొలిసారి మహిళా అధ్యక్షురాలు అవ్వొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Akhanda Godavari Project: కూటమి ప్రభుత్వం నేపథ్యంలో జూన్ 26న అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. చిరకాల వాంఛగా ఉన్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తాజాగా ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈనెల 26న అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారని అయన తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. 127 సంవత్సరాల రాజమండ్రి…
Minister Kishan Reddy: విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అసాధారణ పురోగతి సాధించిందని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన “మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల అభివృద్ధి ” కార్యక్రమాలపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇంకా బీజేపీ నేతలు దేశ అభివృద్ధికి మోడీ…
ఇటీవల కేన్సర్ ప్రబలి పోతోంది.. మన దేశంలో ప్రతీ లక్షకు 9 మంది కేన్సర్ బారిన పడుతున్నారు.. వైద్యానికి అయ్యే ఖర్చు బయట నుంచి తెచ్చే అప్పు కట్టలేక ప్రజలు పేదరికం బారిన పడుతున్నారు. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకొచ్చిందని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి పేర్కొనింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎంను కలవడం ఆనవాయితీగానే వస్తోందన్నారు పురంధేశ్వరి.. ఇద్దరి మధ్యా పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి.. రాజకీయ అంశాలు సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది... రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చు.. అమిత్ షా, సీఎం కలయికలో వచ్చే అంశాలపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు..
హైందవ శంఖారావం సభలో పెద్ద ఎత్తున హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదని.. కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం తమ పార్టీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు.
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ పురందేశ్వరిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో అల్లు అర్జున్ పై ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. అల్లు అర్జున్ విషయంలో తమకు ఎలాంటి కక్షసాధింపు లేదని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.