Read Also: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువశక్తి పేరుతో రాష్ట్రంలోని యువత సమస్యలపై గళమెత్తనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఏడాది నుంచి పలు జిల్లాలలో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. జనవరి 12న ఉదయం 11 గంటలకు ఈ బహిరంగ సభ ఉంటుందని ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది.
Read Also: Pakistan: మేం పాకిస్తాన్‌లో ఉండలేం.. దేశం వీడేందుకు సిద్ధం
కాగా యువశక్తి కార్యక్రమం గురించి ఇప్పటికే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పలు విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని యువజనోత్సవ వేడుకగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. జనవరి 12న ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని.. యువతకు భరోసా ఇవ్వడానికే యువశక్తి సభ నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. మరోవైపు వైసీపీ విముక్త ఏపీ కోసమే జనసేన పోరాటమని స్పష్టం చేశారు. జనసేన వారాహి వాహనంపై వైసీపీ విమర్శలు చేయడం విడ్డూరమని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం యువత కోసం ఇప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వర్సిటీల్లో మౌలిక వసతులు కల్పించడంలో జగన్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.