Off The Record : కంచు కోటకు కన్నాలు పడుతుంటే… టీడీపీ అధిష్టానం చోద్యం చూస్తోందా? మాకో నాయకుడు కావాలి మొర్రో… అని కేడర్ మొత్తుకుంటున్నా, బాధ్యతలు తీసుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నా… పార్టీ పెద్దలు మాత్రం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు? అధికారంలో ఉండి కూడా.. మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్న చోట ఒక ఇన్ఛార్జ్‌ని పెట్టుకోలేని దైన్యం ఏంటి? ఎక్కడ తేడా కొడుతోంది.. శ్రీకాకుళం జిల్లా ముఖ ద్వారం, వెనుకబాటు ఉన్న చోట అభివృద్ధి జాడలు…
అక్కడ ముందు రోజు కనిపించిన కొండ మరుసటి రోజుకు షేప్ మారిపోతోందట. రాత్రికి రాత్రే విచ్చలవిడిగా జరుపుతున్న అక్రమ తవ్వకాలతో కొన్ని కొండలకు బోడి గుండ్లు అవుతుంటే… మరికొన్ని అసలు మాయమైపోతున్నాయి. ఎవరు అలా చేస్తున్నారంటే… అన్ని వేళ్ళు కూటమి ఎమ్మెల్యేల వైపే చూపిస్తున్నాయి. ఏ జిల్లాలో జరుగుతోందా తంతు? ఏ స్థాయిలో ప్రకృతి సంపద లూటీ అవుతోంది? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొండలకు బోడిగుండ్లు అవుతున్నాయి. ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌గా ఉండే ఎర్రమట్టి కొండల్ని గ్రావెల్…
HM Suspended: విద్యార్ధులతో కాళ్లు పట్టించుకున్న ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాగా, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న సుజాత వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఉపాధ్యాయురాలు ఎంతో హుందాగా సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ కుర్చీలో కూర్చిని ఉండగా.. ఇద్దరు విద్యార్థినులు ఆ హెచ్‌ఎం కాళ్లు నొక్కుతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆమెపై…
Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రైవేట్ ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమాయకుల ప్రాణాలు పోయాయి.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూనే, భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.. కాశీబుగ్గలో…
Ban on Diwali Celebrations: దీపావళి ఈ పేరు వింటేనే అంతా కోలాహలంగా ఉంటుంది. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, ఓ గ్రామం మాత్రం తరతరాలుగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటోంది. అసలు… దీని వెనుక కారణం ఏంటి? పండుగకు వాళ్లు ఎందుకు దూరంగా ఉంటున్నారు? దేశవ్యాప్తంగా జరుపుకునే విధంగానే శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటారు. ఏ పండగా పేరుతో గార మండలంలో ఓ గ్రామం కూడా ఉంది.…
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
చికెన్ పకోడీ వివాదం ఒక వ్యక్తిని హత్య చేసేదాకా వచ్చింది. మద్యం మత్తు నిండు ప్రాణాన్ని బలి చేసింది. మరొకరిని హంతకుడిగా మార్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసపలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లాడు. చికెన్ పకోడీ కావాలని అడిగాడు. అయితే, షాపు యజమాని…
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో సీనియర్స్‌కి కొదవేం లేదు. అదే... ఎక్కడికక్కడ ఆధిపత్య పోరుకు బీజం వేసిందన్నది పార్టీ నేతల మాట. వీరిని కట్టడం చేసేందుకు గతంలో ఇన్ఛార్జ్‌లుగా ఉన్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు ప్రయత్నించేవారు. అభిప్రాయ తమ అనుభవాన్ని, పొలిటికల్ సీనియారిటీని ఉపయోగించి వేదికల మీద జరిగే గొడవల్ని నాలుగు గోడల మధ్యకు తీసుకురాగలిగేవారు.
గుజరాత్ రాష్ట్రంలో గ్యాస్ సిలండర్ పేలిన ఘటనలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మృతిచెందారు.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు చెందిన వలస కూలీలు గుజరాత్ రాష్ట్రం ముంద్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు విడిచారు..
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కానీ మనస్సు, మానవత్వం ఉందని అన్నారు.