37 Percent of Pakistanis are willing to leave nation: పాకిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు ఏమంత బాగోలేవు. రాజకీయ అనిశ్చితితో పాటు ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని వెంటాడుతోంది. అభివృద్ధి లేదు, ఉద్యోగాలూ లేవు. మెరుగైన జీవనం లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. అందుకే.. ఆ దేశం విడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏకంగా 37 శాతం మంది కుండబద్దలు కొట్టారు. ఒక సర్వే ఈ షాకింగ్ విషయాన్ని బట్టబయలు చేసింది. పైగా ఈ సర్వే చేసింది బయటి సంస్థలు కావు, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవల్‌పమెంట్ ఎకనామిక్స్ సంస్థ చేసింది. దేశభక్తి & విధేయత అంశాలపై పాకిస్తానీయుల మనోగతం తెలుసుకునేందుకు ఆ సంస్థ సర్వే నిర్వహించగా.. 37 శాతం పాకిస్తానీయులు ఆ దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తేలింది.
Rajnath Singh: ఎలాంటి అతిక్రమణలనైనా ఎదుర్కొనే సత్తా భారత్ సైన్యానికి ఉంది
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అయితే.. పాక్ వీడేందుకు 47 శాతం ప్రజలు రెడీగా ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని 44 శాతం మంది ప్రజలు కూడా.. తమకు దేశం విడిచి వెళ్లాలనుందన్న మాటే చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతే ఎక్కువగా పాల్గొంది. వారిలో మహిళల కంటే పురుషులే (64 శాతం) దేశం వీడాలన్న అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ సర్వేపై పాకిస్తాని పాలసీ అనలిస్ట్ రాజా అహ్మద్ రూమీ మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షేమం, అభివృద్ధి, అవకాశాలు లేకపోవడం వల్లే పాక్‌ని వీడేందుకు ఆ దేశస్తులు కోరుకుంటున్నారని అన్నాడు. ‘‘పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా సంవత్సరాల నుంచి సంక్షోభంలో ఉంది. దాంతో ఉద్యోగాలు దొరకడం లేదు. సంక్షోభం కారణంగా పాక్‌లో అభివృద్ధి కొరవడింది. దీంతో విసుగెత్తిన యువకులు.. మెరుగైన జీవనం కోసం విదేశాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు’’ అని పేర్కొన్నాడు.
Akhilesh Yadav: 2024లోగా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఆ దిశగా కేసీఆర్ కృషి
ఈ సర్వేపై పాకిస్తాన్ తెహ్రీన్-ఏ-ఇన్సాఫ్ నేతలు సైతం వెంటనే స్పందించారు. ఈ రిపోర్ట్ ఒక వేకప్ కాల్ అని.. ప్రజలకు, ఇతర సంస్థలకు మధ్య పెరుగుతున్న అంతరం వల్లే దేశంలో అనిశ్చితికి కారణమైందని పేర్కొన్నాడు. అందుకే ఎక్కువమంది పాకిస్తానీయులు దేశాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నారని తెలిపాడు. పీటీఐ ప్రతినిధి ముజమ్మిల్ అస్లాం కూడా ఈ సర్వేపై స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్‌పై మన భవిష్యత్ తరం ఆశలు కోల్పోతోందన్న విషయాన్ని ఈ సర్వే తెలియజేస్తోంది’’ అని చెప్పాడు. అయితే.. గాలప్ పాకిస్తాన్, వరల్డ్‌వైడ్ ఇండిపెండెంట్ నెట్‌వర్క్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్ సంయుక్తంగా ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో మాత్రం భిన్నమైన ఫలితాలొచ్చాయి. తమకు విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి, దేశం విడిచి వెళ్లకూడదని 70 శాతం మంది కోరుకుంటున్నట్టు ఆ సర్వే పేర్కొంది.
Ayodhya Mosque: అయోధ్య మసీదుకి అడ్డంకి క్లియర్.. ఆసుపత్రి కూడా!