Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లతో హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి…
Pawan Kalyan New Strategy: జనసేన పార్టీ భవిష్యత్తు దిశలో కీలకమైన అడుగుగా పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్ వేశారు.. అదే త్రిశూల వ్యూహం.. అయితే, జనసేనాని రూపొందించిన త్రిశూల వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మూడు దిశల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందిన ఈ వ్యూహం.. పార్టీ భవిష్యత్తు దిశను, కూటమి సమీకరణాలను ప్రభావితం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ త్రిశూల వ్యూహం మూడు ప్రధాన అంశాలపై సాగుతోంది..…
Ram Talluri: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు అధ్యక్షుడు పవన్ ప్రకటన విడుదల చేశారు. "జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరిని నియమిస్తున్నాను. పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను ప్రధాన కార్యదర్శి హోదాలో నిర్వర్తిస్తారు. పార్టీ కోసం పని చేస్తానని 2014లోనే ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఎటువంటి ఆపేక్ష లేకుండా పార్టీ పట్ల ఎంతో అంకిత భావాన్ని కనబరుస్తూ,…
జనసేన 2014లో పోరాటాల గడ్డ తెలంగాణలో ప్రారంభించాం అని, ఆంధ్రప్రదేశ్‌లో నిలదొక్కుకున్నాం అని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సగటు మనిషి కోపం నుంచి పుట్టిందే జనసేన పార్టీ అని చెప్పారు. కులం, కుటుంబం, రాష్ట్రం, ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదన్నారు. ప్రజల కష్టాలు పరిష్కరించినప్పుడు తన నిర్ణయం సరైందే అనిపించిందన్నారు. పార్టీ మొదలుపెట్టినప్పుడు తన ఆలోచన సగటు మనిషి ఆలోచన అని.. జనాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆకాంక్షలు…
విశాఖ వేదికగా 'సేనతో సేనాని' కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రెండురోజుల పాటు సాగిన ఈ సమావేశాలు.. ఇవాళ బహరంగసభతో ముగియనున్నాయి.. సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు..
మూడు రోజుల జనసేన పండుగకు విశాఖ నగరం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు జరుగుతున్న సమావేశాలు కావడంతో శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. ఇవాళ, రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఏడాది పూర్తయిపోయింది. ఈ టైంలో అమలైన హామీలు, జరిగిన పనుల గురించి విస్తృత చర్చ మొదలైంది రాష్ట్రంలో. ఆ చర్చ దిశగానే తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. అయితే... రాజకీయంగా చూసుకుంటే... ఇది కూటమి పార్టీల మధ్య బాగా సున్నితమైన అంశంగా మారుతున్న సౌండ్ వినిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలిచ్చింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టి సారించింది.
Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది జనసేన. జిల్లాలోని ఆరు సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించి కంచుకోటగా నిలబడింది. అలాంటి జిల్లాలో పార్టీ అధినేత ఆశించిందొకటి.. ఎమ్మెల్యేలు చేస్తున్నదొకటి అన్నట్టుగా తయారైందట పరిస్థితి. ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జనసేన నేతలు.. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో… భవిష్యత్తు సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్నట్టు ఆత్రంగా వ్యవహరిస్తున్నారట.…
Janasena: పిఠాపురం మండలంలోని పక్రుద్దీన్ పాలెం పాపిడి దొడ్డి చెరువు వద్ద మట్టి తవ్వకాలు ముదిరి జనసేన పార్టీలోని నేతకు రెండు వర్గాలుగా చీలిపోయి వీధికెక్కే స్థాయికి వెళ్లింది. విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి కురుమళ్ళ రాంబాబుపై, విరవాడకు చెందిన పలువురు జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో ప్రారంభమైంది. చెరువులో మట్టి తవ్వకాలకు అవసరమైన అధికార అనుమతుల…