CPI Ramakrishna Comments On Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఇక పూర్తి కాదనే స్థితికి తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పోలవరం నిర్మాణం చేస్తున్నవారే నష్టం జరిగిందని చెప్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తిగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 15 వేల కోట్లు చొప్పున విడుదల చేసి ఉంటే.. పోలవరం ప్రాజెక్ట్ ఈపాటికే పూర్తయ్యేదని అన్నారు. ఇప్పుడు కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుని, పోలవరం పూర్తి చేయాలని కోరారు. అమూల్ కంపెనీకి విజయ ఆస్తులు ఎందుకు దోచిపెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు సంఘాల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. నేడు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. అక్కడ ఏయే అంశాల మీద మాట్లాడతారో క్లారిటీ ఇవ్వాలన్నారు. ప్రధాని, హోంమంత్రిలను కలిసి ఏం మాట్లాడారో వివరణ ఇవ్వాలని కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం సక్రమంగా రావడం లేదని ఆరోపించారు.
Porn Addiction: పోర్న్‌కి బానిసయ్యాడు.. భార్యని కూడా అలాగే డ్రెస్సులు వేసుకోమని..
ఇదే సమయంలో.. మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై రామాకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య సోము వీర్రాజు మీద నెగెటివిటీ ఎక్కువ వచ్చిందని, అందుకే ఆయన్ను పక్కన పెట్టారని అభిప్రాయపడ్డారు. సత్యకుమార్, సీఎం రమేష్‌కు కాకుండా పురంధేశ్వరికి అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. బీజేపీతో చేతులు కలిపేవాళ్ళకు ఈసారి వ్యతిరేకత తారాస్థాయిలో వస్తుందని పేర్కొన్నారు. మరి, చంద్రబాబు బీజేపీతో కలుస్తాడా? లేదా? అనేది తేల్చుకోవాలని సూచించారు. బీజేపీతో చంద్రబాబు కలిస్తే, ఆయనపై ప్రజల్లో నెగెటివిటీ వస్తుందని చెప్పారు.
Extramarital Affair: భర్తని వదిలి మరొకరితో పెళ్లి.. షాకిచ్చిన రెండో భర్త.. చివరికి?