Pavirta Commits Suicide Over Husband Chethan Gowda Affair With Employee: మొదటి భర్తతో తన దాంపత్య జీవితం సాఫీగా లేకపోవడంతో, ఓ మహిళ అతనితో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లకే తాను పని చేసే సంస్థ యజమానిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ప్రేమపెళ్లి చేసుకోవడంతో, ఇకపై తన కాపురం హాయిగా, సుఖంగా సాగుతుందని కలల కంది. ఆమె కోరుకున్నట్టుగా మొదట్లో అంతా సజావుగానే సాగింది. కానీ, ఆ తర్వాత ఆమెకి ఊహించని షాక్ ఇచ్చాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కుంగిపోయిన ఆ మహిళ, ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Niharika-Chaitanya Divorce: విడాకులపై స్పందించిన నిహారిక.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర (30) అనే మహిళ గతంలో ఓ పెళ్లి చేసుకుంది. మొదట్లో దాంపత్య జీవితం సాఫీగానే సాగినా, ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. దీంతో.. పవిత్ర మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత తాను పని చేస్తున్న సంస్థ యజమాని చేతన్‌గౌడకు దగ్గరైంది. తన పట్ల అతడు చూపించిన ప్రేమ, ఆప్యాయతల్ని చూసి.. అతనితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో.. పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన వ్యక్తి తన జీవితంలోకి రావడంతో.. ఇకపై అంతా సజావుగానే సాగుతుందని పవిత్ర అనుకుంది. కానీ, ఇంతలోనే చేతన్ ఆమెకు పెద్ద షాకిచ్చాడు. మరో యువతితో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు భార్యకు తెలియకుండా గుట్టుగా తన ఎఫైర్ నడిపించాడు కానీ, ఆ తర్వాత భార్యకు అతడు దొరికిపోయాడు.
Anil Kumar Yadav: భయమనేది నా రక్తంలోనే లేదు.. యుద్ధానికైనా వస్తా
ఇక అప్పటి నుంచి పవిత్ర, చేతన్ మధ్య గొడవలు మొదలయ్యాయి. తానేం తక్కువ చేశానని మరో మహిళతో వివాహేతర సంబందం పెట్టుకున్నావంటూ పవిత్ర నిలదీసింది. అప్పుడు.. తాను మగాడినని, ఏమైనా చేసుకుంటానని పవిత్ర తల్లి ముందే దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన పవిత్ర.. భర్తతో గొడవ పడిన వీడియోతో పాటు తాను ఆత్మహత్య చేసుకుంటానని రాసిన డెత్‌నోట్‌ను తన మొబైల్ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. అది చూసిన ఆమె తల్లి పద్మమ్మ.. వెంటనే ఇంటికి వచ్చింది. కానీ, అప్పటికే పవిత్ర ఉరి వేసుకుని, విగతజీవిగా మారింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చేతన్‌గౌడ, అతని ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.