CPI Ramakrishna: మొంథా తుఫాను వల్ల తీవ్ర పంట నష్టం జరిగింది అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తుపాను శాపం.
CPI Ramakrishna: స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు పేర్లు ప్రధాన ప్రస్తావించకపోవడం శోచనీయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కాంగ్రెస్, సీపీఐదీ తిరుగులేని పాత్ర.. ఆర్ఎస్ఎస్ కు స్వాతంత్ర సంగ్రామంతో ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు.
ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్‌పై మరోసారి ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు..
CPI Ramakrishna: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీ, వైసీపీ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆదాని పవర్స్ తో 17 వందల కోట్ల రూపాయల లంచం తీసుకుని వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చాక యూజర్ చార్జీల పేరుతో మరో రూ. 15 వందల కోట్లు ప్రజలపై భారం వేసింది అని ఆరోపించారు.
మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వస్తామన్నా కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామనే పద్ధతి అనుసరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రుదేశం పాకిస్థాన్‌తోనే చర్చలు జరిపి యుద్ధం ఆపేశారని, మావోయిస్టులు భారత పౌరులు అయినా చర్చలు చేయమంటారా? అని రామకృష్ణ ప్రశ్నించారు. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు…
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ సంస్థలను కార్పొరేట్ రంగాలకు ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళారుపాలా శిక్షణా శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. జడ్జీలకు బాధ్యత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. సుప్రీంకోర్టు తాజా తీర్పు రాష్ట్రపతిని ఆదేశిస్తోంది.. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని కామెంట్ చేశారు.. అయితే, ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను సుప్రీంకోర్టుపై దాడిగానే భావిస్తున్నాం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కె.రామకృష్ణ..
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అప్పుడన్న మీరు జగన్ ను మించిపోయారు అప్పు తేవడంలో.. రాష్ట్ర అప్పుల పైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని.. కేంద్ర ప్రభుత్వ గ్రాంటు అని చెప్పి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అప్పులు తెస్తున్నారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు.
CPI Ramakrishna: రాయలసీమ సాగు నీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై సమావేశం. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రి రావు, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. గాలేరి, హంద్రీనీవా వంటి పలు ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలి అన్నారు.