YSRCP: బెజవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. మంగళవారం ఉదయం 12 గంటల సమయంలో జైలు దగ్గరకు వచ్చిన ఆయన వంశీ భార్య పంకజ శ్రీతో కలిసి వంశీని పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ అధికార పార్టీ, వారికి సహకరిస్తున్న అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన అధికారులను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వంశీని వ్యక్తి గత కక్ష రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారని, ఫిర్యాదు చేసిన సత్య వర్ధన్ అనే వ్యక్తి ఈ కేసుతో తనకు సంబంధం లేదని జడ్జి ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చారన్నారు. వంశీకి సంబంధం లేదని చెప్పినా కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు జగన్. అయితే, జగన్ కామెంట్లపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.. ఇదిగో సాక్ష్యాలు అంటూ.. వీడియో విడుదల చేశారు.. అంతేకాదు.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి ఘటన, జగన్ కామెంట్లను కలిపి ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. అయితే, బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది వైసీపీ..
Read Also: Delhi CM : ఎల్లుండే రాజధానిలో ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీ సీఎం పదవి ఎవరికి?
టీడీపీ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది.. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని.. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ ఆరోపించింది.. కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం.. చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్దన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్‌మెంట్ ఇచ్చారు.. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడలేనన్న సత్యవర్ధన్.. టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నానని వెల్లడించింది.. తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా కోర్టులో వెల్లడించారు.. కోర్టు ఎదుట సత్యవర్దన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇదీ.. సత్యమేవ జయతే.. అంటూ.. సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌ను కూడా జత చేస్తూ ట్వీట్ చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ..
💣 Truth Bomb 💣
వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు
– గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు
– కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం
– చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవ… pic.twitter.com/H5hseJpSv0
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025