ఎల్లుండి రాంలీల మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది.
READ MORE: Ambati Rambabu: రేపు గుంటూరు మిర్చి యార్డ్‌కు వైఎస్ జగన్.. కీలక వ్యాఖ్యలు చేసిన అంబటి
ఇదిలా ఉండగా.. రేపు బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది. మరోవైపు.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే నాయకులు పలువురు కేంద్ర మంత్రులు, భారత్‌లోని విదేశీ దౌత్య వేత్తలు హాజరు కానున్నారు.
READ MORE: John Wesley: సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బహిరంగ లేఖ..
కాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మంగళవారం అధికారికంగా రేఖ గుప్తా పేరును బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేఖ గుప్తా.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గతంలో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండటంతో పాటు కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీ పెద్దలతో ఎక్కువ సంబంధాలు ఉండడంతో ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేరు. అందుకోసమే ఢిల్లీ సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావించింది. అందులో పార్టీ కోసం కష్టపడిన రేఖ గుప్తాను అధిష్టానం పెద్దలు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అదే ఫార్ములాను ఢిల్లీలో కూడా అమలు చేయడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖ గుప్తాకు అవకాశం దక్కుతోంది.