గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రెండు రోజుల కస్టడీ పూర్తి అయ్యింది.. రెండు రోజుల పాటు నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీని ప్రశ్నించారు కంకిపాడు పోలీసులు..
వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులోనే వంశీని 2 రోజులపాటు కోర్టు అనుమతితో విచారించనున్నారు పోలిసులు. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి.. వంశీని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే వల్లభనేని వంశీ…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు నిరాశ ఎదురైంది.. అక్రమ మైనింగ్ కేసులో తనపై పీటీ వారెంట్ దాఖలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది.. అయితే, దిగువ కోర్టు పీటీ వారెంట్ అనుమతించినా వచ్చే గురువారం వరకు వారెంట్ అమలు చేయబోమని కోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చింది నూజివీడు కోర్టు.. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీ మోహన్‌ను ఈ కేసులో హాజరు పరచాలని ఆదేశాలు ఇచ్చింది నూజివీడు కోర్టు..
వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఊరట దక్కింది.. వల్లభనేని వంశీ మోహన్‌కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.. మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని వంశీపై కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ.. ఇక, దీనిపై విచారణ జరిపి ముందస్తు బెయిల్ ఇచ్చింది నూజివీడు కోర్టు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది జిల్లా కోర్టు.. ఆత్కురులో 9 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 9వ తేదీ వరకు పొడిగించింది కోర్టు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించనుంది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం.. దీంతో, అసలు వంశీకి బెయిల్ వస్తుందా? మరోసారి షాక్ తప్పదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది..