వల్లభనేని వంశీ మోహన్‌కు మరో సారి షాక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం..
టీడీపీ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది.. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని.. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ ఆరోపించింది.. కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం.. చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్దన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్‌మెంట్ ఇచ్చారు..
"నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు?'' అంటూ ఎద్దేవా చేశారు.. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్టు ఉన్నారు అంటూ దుయ్యబట్టారు.. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి అని సూచించారు.. 100 మందికిపైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూశారని గుర్తుచేశారు..