CM Chandrababu:రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.. తిరుపతి ఎర్రచందనం డిపో సీసీటీవీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.. ఎర్రచందనం దుంగలను వ్యాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులు తయారు చేయాలి.. అలాగే ఎర్రచందనం ఉత్పత్తులు, ఇతర అంశాలు తెలియచేసేలా డిపో వద్ద ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనం అనేది ఓ అరుదైన జాతి వృక్షంగా పేర్కొన్నారు.. ఇక, మోటారు వాహనాల పన్నులపై కలెక్టర్లు దృష్టి సారించాలి.. మున్సిపల్ విభాగం శాటిలైట్ చిత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించేలా ప్రక్రియ చేపట్టాలి.. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను పూర్తి చేసేలా కలెక్టర్లు ఫోకస్ చేయాలి.. కొత్త లేఔట్లలో డ్రైన్లకు స్థలం కేటాయించేలా అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు..
Read Also: Meghalaya Political Crisis: మేఘాలయలో ఒకేరోజు 8 మంది మంత్రులు రాజీనామా.. ఈశాన్య రాష్ట్రంలో గందరగోళం
ఇక, స్వర్ణ పంచాయత్ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.. గ్రామకంఠంలోని ఆస్తులకు కోటికి పైగా యాజమాన్య పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎం చంద్రబాబు.. 60 శాతం ఫిర్యాదులు రెవెన్యూ శాఖ లోనే వస్తున్నాయన్న ఆయన.. కులధృవీకరణ, భూములు ఇలా వేర్వేరు అంశాలు ఉన్నాయి.. 22 ఏలో భూములు పెట్టేయటం లాంటి చర్యల వల్ల దుష్పలితాలు వచ్చాయన్నారు.. గత ప్రభుత్వ హయాంలో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి ఇష్టానుసారం వ్యవహరించారు.. ఇప్పుడా చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల రక్షణకు వీలుగా చట్టాన్ని తెచ్చాం.. భూముల్ని కాజేయడానికి 22ఏలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశారు. రీసర్వే చేసి ఈ రికార్డులను సరిచేయాలి. నిర్దేశిత గడువులోగా వీటిని ప్రక్షాళన చేయాని కలెక్టర్లను ఆదేశించారు సీఎం చంద్రబాబు..
Read Also: Indiramma Housing Scheme: ఇందిరమ్మ లిస్ట్‌లో పేర్లు తొలగించారని నిరసన.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళల!
కులం ఎవరిదీ మారిపోదు దానిని శాశ్వతప్రాతిపదికన ఇవ్వాలి.. నివాస, వయో ధృవీకరణ కోసం ప్రతీ ఏటా జారీ చేయొచ్చు.. అభ్యంతరం లేని భూములన్నీ రెగ్యులర్ చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కృతం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.. 2027 కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించండి అని సలహా ఇచ్చిన ఆయన.. రికార్డులన్నీ ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా పని చేయాలి.. జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ కూడా పెట్టి రికార్డులు ఇస్తాం.. వీఎంలు, కేఎంలు మార్చాం కానీ రెవెన్యూ విలేజిలను మార్చలేకపోతున్నాం అన్నారు.. ఇక, అక్టోబరు 22 వరకూ నెల రోజుల పాటు జీఎస్టీ ప్రయోజనాలు వివరించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..