Indiramma Housing Scheme: పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గ పరిధిలోని ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో తమ పేర్లు లేవని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మొదటి లిస్టులో తమ పేర్లు ఎంపిక చేసి తర్వాత లిస్టులో నుండి తమ పేర్లను తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఎనిమిది మంది మహిళలు ట్యాంక్ ఎక్కి రెండు గంటల పాటు ఆందోళన బాట పట్టారు.
ఈ విషయమై ఎంపీడీవో నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు మహిళలు. ఆన్లైన్లోనేమో మా పేర్లు ఉన్నాయని, గ్రామపంచాయతీ లిస్టులో మాత్రం మా పేర్లను తొలగించారని నిరసనకారులు తెలిపారు. మేము నిరుపేదలం, కూలీ నాలి చేసుకుంటేనే రోజు గడుస్తుందని మాలాంటి వాళ్ళ పొట్ట కొట్టకండి అని వేడుకున్నారు. గోదావరిఖని ఏసిపి మడత రమేష్ ఘటన స్థలానికి చేరుకొని నిరసన తెలుపుతున్న మహిళలతో మాట్లాడి వారిని కిందికి రప్పించారు.
ACB Raids: కట్టలు కట్టలుగా నగదు పట్టవేత.. 18 చోట్ల సోదాలు, 200 కోట్ల ఆస్తులు గుర్తింపు!