Meghalaya Political Crisis: మేఘాలయలో ఒకేరోజు 8 మంది మంత్రులు రాజీనామా.. ఈశాన్య రాష్ట్రంలో గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meghalaya Political Crisis: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో రాజకీయ గందరగోళం నెలకొంది. మంగళవారం ఒక్కరోజులో 12 మంది మంత్రులలో ఎనిమిది మంది అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు. ప్రస్తుతం మేఘాలయలో ఎన్‌పిపి నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే రాజీనామా చేసిన మంత్రులు సీఎం కాన్రాడ్ కె సంగ్మా సమక్షంలో వారి రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు. ఇంతకీ ఈ రాజీనామాలకు కారణం ఏంటి..
READ ALSO: Vijayawada Utsav: ‘విజయవాడ ఉత్సవ్’కు హైకోర్టు షాక్..!
Also Read
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
మంత్రివర్గంలోకి కొత్తవారికి ఛాన్స్..
ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన మంత్రివర్గంలో కొంతమంది కొత్త నాయకులను చేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుత మంత్రులను రాజీనామా చేయమని కోరినట్లు సమాచారం. రాజీనామా చేసిన ఎనిమిది మంది మంత్రులలో NPPకి చెందిన అంపారీన్ లింగ్డో, కమెగోన్ యంబోన్, రక్కం ఎ సంగ్మా, అబు తాహిర్ మండల్, UDPకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, HSPDPకి చెందిన షక్లియార్ వార్జ్రీ, BJPకి చెందిన AL హెక్ ఉన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 60 మంది సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారంలో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 12 మందికిపైగా మంత్రులు ఉండకూడదు. తాజాగా రాజీనామా చేసిన వారు ఆయా పార్టీల సంస్థాగత పనుల్లో నిమగ్నం కానున్నట్లు సమాచారం. మంత్రివర్గంలోకి కొత్తగా రానున్న సభ్యులతో మంగళవారం సాయంత్రం రాజ్ భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక అధికారి తెలిపారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కారణాలు..
మేఘాలయలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వెనుక అనేక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రాంతీయ సమతుల్యతను కాపాడుకోవడానికి, ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరచడానికి, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని సమాచారం. అలాగే కొత్త ముఖాలను చేర్చడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలో భాగంగా దీనిని చెబుతున్నారు.
READ ALSO: London Protests 2025: లండన్ నిరసనలకు ముస్లింలు కారణమా! అసలు బ్రిటన్‌లో ఏం జరుగుతుంది..
తాజావార్తలు
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!