రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.. తిరుపతి ఎర్రచందనం డిపో సీసీటీవీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.. ఎర్రచందనం దుంగలను వ్యాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులు తయారు చేయాలి.. అలాగే ఎర్రచందనం ఉత్పత్తులు, ఇతర అంశాలు తెలియచేసేలా డిపో వద్ద ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు..
కొత్తగా నియమితులైన 12 మంది కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు చంద్రబాబు.. సీఎం అంటే కామన్ మెన్ అని నేను చెబుతున్నా.. మీరు కూడా అలాగే పని చేయాలని సూచించారు.. ప్రతి పనికి దానికీ డబ్బులు లేవని చెప్పద్దు.. కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఉపయోగించుకోవాలి.. అన్నింటికీ రూల్స్ అనొద్దన్నారు..
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. కలెక్టర్ల పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది రెగ్యులర్ వర్క్ షీట్ పంపడం లేదు.. క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదు.. పని తీరు మార్చుకోవడం లేదు.. అలాంటి వాళ్ళు.. సీఎస్ నీ కలిసి మేము గ్రౌండ్ వర్క్ చేయలేం అని రిపోర్ట్ చేయండి ఏసీ కింద పని…
కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణా అధికారులు అన్నారు సీఎం చంద్రబాబు. ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు.. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్ని విషయాలు ప్రస్తావించారు... విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు..
వచ్చే నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సదస్సులు జరిగాయి. మొన్నటి సమావేశాల్లో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శాఖల వారీగా తమ అభిప్రాయాలను తెలిపారు. తగిన సమయం లేని కారణంగా కలెక్టర్లు తమ అభిప్రాయాలు చెప్పలేకపోయారు. ఈసారి 36 ప్రభుత్వ శాఖల అధికారులు జిల్లాల సమాచారంతో ముందుగానే ప్రజెంటేషన్లు సిద్ధం చేయనున్నారు. సదస్సు…
సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందని.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.
సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది. అందులో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు సీఎం సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో భేటీ గంటకు పైగా కొనసాగుతుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.