CM Chandrababu: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది.. 6,033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు.. వైసీపీ అభ్యర్థి కేవలం 683 ఓట్లతో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.. దీంతో, 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానం తెలుగుదేశం పార్టీ వశమైంది.. ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. జిల్లాలో అందరూ ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని సూచించారు..
Read Also: Coolie : లోకేష్ కనకరాజ్ సక్సెస్ జర్నీకి ‘కూలీ’ బ్రేక్ వేసినట్టేనా?
పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి.. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారనే విషయాన్ని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ రోజు 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని అక్కడి ప్రజలు స్లిప్పులు పెట్టారంటే.. అక్కడ ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది ప్రజలు గమనించాలని సూచించారు.. ఇక, పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలు నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, పులివెందుల విజయంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకాలో గ్రాండ్ విక్టరీ కొట్టామంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..