పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. జిల్లాలో అందరూ ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని సూచించారు.. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి.. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారనే విషయాన్ని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక లలో టీడీపీ విజయంపై స్పందించారు.. పులివెందులలో జరిగిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగాయి.. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని తెలిపారు బాలయ్య.. ఇక్కడ జరిగిన ఎన్నికలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అక్కడి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ ఎన్నికల్లో 11 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నామినేషన్లు కూడా వేశారు.. ప్రజలు ధైర్యంగా వచ్చి ఓట్లు వేశారు.. అంటే.. అక్కడ…
ఒకే ఒక ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్ధలు కొట్టింది.. దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది అని వ్యాఖ్యానించారు.. సొంత ఇలాకాలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకో లేకపోయారంటే.. పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిపై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందన్నారు.. ఇది వైసీపీ ఓటమి కాదు.. జగన్ అహంకారానికి చెంపదెబ్బ.. అవినీతికి, అణచివేతకు, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వ్యాఖ్యానించారు..