Coolie : లోకేష్ కనకరాజ్ సక్సెస్ జర్నీకి ‘కూలీ’ బ్రేక్ వేసినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమలోఒక్క ప్లాప్ కూడా లేకుండా సినిమా చేయడం అనేది సవాల్ తో కూడుకున్న పని. కానీ ఓ దర్శకుడు మాత్రం డైరెక్షన్ స్టార్ట్ చేసిన నాలుగేళ్లలో 7 సినిమాలు చేసినా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా దూసుకెళ్తున్నాడు. పరాజయం అనే పదాన్నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా జైత్రయాత్ర సాగిస్తున్నాడు. అతడెవరో కాదు ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లోకేష్ కనగరాజ్.
Also Read : Preity : టాలీవుడ్ కు దూరంగా.. కోలీవుడ్.. మాలివుడ్ లో యంగ్ బ్యూటీ బిజీ
Also Read
మా నగరంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ ఖైది సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఒక రాత్రిలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాతో లోకేష్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక ఆ తర్వాత విజయ్ తో మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కు చేరుకున్నాడు లోకేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ RAJINIKANTH కూలీ సినిమాను తెరకెక్కించాడు లోకి. ఈ మల్టీ స్టారర్ మూవీ కి అయిన బడ్జెట్ సుమారు ₹300 కోట్లు. భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. లోకేష్ కెరీర్‌లో రిస్క్ మోస్ట్ ప్రాజెక్ట్ గా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ అలాగ తమిళనాట ఉదయం ఆట నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. కథ, కథనం వీక్ గా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఫ్లాప్లే లేని ఈ డైరెక్టర్ కు కూలీ బ్రేక్ వేసిందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రీ బజ్ కారణంగా బుకింగ్స్ లో మాత్రం ఎక్కడ తగ్గకుండా దూసుకెళ్తోంది కూలి. వచ్చే సోమవారం వర్కింగ్ డే స్టార్ట్ అయితే కానీ కూలీ రిజల్ట్ క్లారిటీ రాదు. కానీ కూలీ లోకి వీకేస్ట్ రైటింగ్ అని చెప్పక తప్పదు.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?