Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, అక్టోబర్ 11వ తేదీన బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం.. ఇక టెండర్ల దాఖలుకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది సర్కార్.. తాజాగా డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో.. డీపీఆర్ టెండర్ల…
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై హాట్ కామెంట్లు చేశారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు.. పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టుగా పేర్కొన్నారు.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదన్నారు..
ఇటీవల ఏపీ మంత్రి లోకేష్ బనకచర్లపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు.. లోకేష్ ముందు నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు గురించి తెలుసుకోండి.. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి లభ్యత దృశ్య 968 టిఎంసి లు తెలంగాణ కు, 531 టీఎంసీ లు ఆంధ్రప్రదేశ్…
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ఒకటే ఎజెండాగా పెడితే చర్చలకు రాలేమని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పామన్నారు. అలాగే, ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించుకుపోయారని ఆరోపించారు.
Telugu CMs Meeting: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Harish Rao Meets KCR: హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా సమావేశమయ్యారు.
గోదావరి జలాలను ఒక్క బొట్టు కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రభుత్వంతో చర్చిస్తాం.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడమన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ని అసలు ఒప్పుకునేదే లేదని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కట్టి.. నీళ్లు ఎక్కడికి తీసుకుపోయారో చూసాము.. పక్కనే ఉన్న గోదావరి నీళ్లను ఇక్కడి ప్రజలకి అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర జల శక్తి కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సమావేశ ఎజెండాలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశం పక్కన పెట్టాలని…
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ బుధవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తిశాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సీఎస్‌లకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని జలశక్తిశాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తిభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది.
Telangana AP water row on Banakacherla Project: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ సర్కార్ లేఖలో ప్రస్తావించింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో…