2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఎన్‌కౌంటర్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలోని చాలా మంది ప్రమాదకరమైన నేరస్థులు పోలీసు ఎన్‌కౌంటర్లలో మరణించారు. పెద్ద సంఖ్యలో నేరస్థులు గాయపడ్డారు. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్లకు సంబంధించిన ముఖ్యమైన డేటాను పంచుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. గత 8 సంవత్సరాలలో 234 మంది ప్రమాదకరమైన నేరస్థులు ఖతమయ్యారట.
READ MORE: Manchu Vishnu : హీరోల వాట్సాప్ గ్రూప్ నుంచి అందుకే బయటకు వచ్చా..
ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రాజీవ్ కృష్ణ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో గత 8 సంవత్సరాలలో 14,741 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 234 మంది భయంకరమైన నేరస్థులు మరణించారు. 9,202 మంది నేరస్థులు గాయపడ్డారు. మొత్తం 30,293 మంది నేరస్థులను అరెస్టు చేశారు. 18 మంది పోలీసులు సైతం మరణించారు. ఈ కాలంలో 1,700 మంది పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీ కింద నేరస్థులపై చర్యలు తీసుకుంటోందని అధికారిక ప్రకటన పేర్కొంది.
READ MORE: Israel Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తాం.. ఇజ్రాయిల్ వార్నింగ్..