Sankranti Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి మేజర్ సీజన్ అనే చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో తమ సినిమాలు ఉండాలని ప్రతి హీరో అనుకుంటారు. అందుకు అనుగుణంగానే టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి సందడి కనిపిస్తుంది. పండుగ సినిమాల పరంగా ప్రతేడాది పోరు రసవత్తరంగానే ఉంటుందనే చెప్పాలి. అలా గతేడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈసారి సంక్రాంతికి కూడా పలు సాలిడ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ అలాగే నటసింహం బాలకృష్ణ నటించిన భారీ బడ్జెట్ సినిమా డాకు మహారాజ్ అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో ఉన్నాయి.
Read Also:Pragya Jaiswal : ‘డాకు మహారాజ్’ అద్భుతంగా ఉంటుంది : ప్రగ్యా జైస్వాల్
అయితే ఇప్పుడు వరకు మన టాలీవుడ్ దగ్గర సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల్లో ఆల్ టైం రికార్డు వసూళ్లను చిన్న సినిమా వచ్చినా గతేడాది హనుమాన్ మూవీ అందుకుంది. యంగ్ హీరో తేజ సజ్జ .. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది. దీనితో హను మాన్ సెట్ చేసిన రికార్డు ఈ సంక్రాంతి సీజన్ లో బ్రేక్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు వరకు వచ్చిన సంక్రాంతి సినిమాల్లో హను మాన్ ఒకటే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలాగే షేర్ పరంగా కూడా ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో హను మాన్ దే పై చేయి. మరి ఈసారి విడుదల అవుతున్న సినిమాలు ఈ రికార్డును బ్రేక్ చేస్తాయో లేదో చూడాలి. ఈ ఛాన్స్ ఎక్కువగా గేమ్ ఛేంజర్ సినిమాకు ఉందని స్పష్టంగా చెప్పొచ్చు.
Read Also:Tummala Nageswara Rao : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు సంక్షేమ ప్రభుత్వం