కరోనా మహమ్మారి కాలంలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ప్రపంచంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ ను కనిపెట్టడం, తయారు చేయడం ఒక అంశమైతే, వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితమైంది, వ్యాక్సిన్‌లో హానికరమైన బ్యాక్టీరీయా ఉన్నదా లేదా అని తెలుసుకోవడం మరో ఎత్తు. దీనికోసం ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తన నిధులను ఖర్చు చేస్తుంటాయి. వ్యాక్సిన్ సురక్షితమా కాదా అనే అంశాన్ని పీతల రక్తంతో మాత్రమే పరీక్షించినపుడు మాత్రమే తెలుస్తుంది. అందుకే ఈ రక్తం కోసం పెద్ద మొత్తంలో నిధులను వినియోగిస్తుంటారు. అయితే, అన్నిరకాల పీతల రక్తం దీనికోసం వినియోగించరు. కేవలం హార్స్ షూ క్రాబ్‌ల రక్తాన్ని మాత్రమే వినియోగిస్తారు. ఈ పీతల రక్తం మార్కెట్ లో లీటర్ రూ. 12 లక్షలకు పైగా పలుకుతుంది. ఈ హార్స్ షూ క్రాబ్స్ రక్తం నీలి రంగులో ఉంటుంది.
Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం: నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే…
ప్రత్యేక పద్దతుల్లో గుండె నుంచి వచ్చే రక్తనాళాల ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన రక్తం నుంచి రక్తకణాలను వేరుచేసి ఎల్ఏఎల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఎల్ఏల్‌కు సూక్ష్మాతి సూక్ష్మమైన హానికర బ్యాక్టీయాను సైతం గుర్తించే శక్తి ఉంటుంది. తయారు చేసిన వ్యాక్సిన్‌లో ఎల్ఏఎల్ ద్వారా పరీక్షించి బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్నాకే ఆ వ్యాక్సిన్‌ను బయటకు పంపుతారు. అన్ని రకాల వ్యాక్సిన్లను ఈ విధంగానే పరిశీలిస్తారు. వ్యాక్సిన్లను మాత్రమే కాదు, స్టంట్స్, సర్జికల్ ఎక్విప్‌మెంట్స్ వేటినైనా సరే ఈ ఎల్ఏఎల్‌తో పరీక్షించిన తరువాతే వినియోగిస్తారు. అందుకే ఈ హార్స్‌షూ క్రాబ్స్ రక్తానికి డిమాండ్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.