ప్రపంచంలోనే ఓ జీవి రక్తానికి అత్యధిక ధర పలుకుతుంది. దాని పేరు "హార్స్ షూ క్రాబ్". ఈ ప్రత్యేకమైన పీత రక్తం ప్రత్యేక రంగులో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
పీతలు దీని ఈ పేరు వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. ఈ పీతలు అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది. వీటిలో పులుసు, రసం, ఇగురును చాలా మంది ఇష్టంగా తింటారు.
కరోనా మహమ్మారి కాలంలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ప్రపంచంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ ను కనిపెట్టడం, తయారు చేయడం ఒక అంశమైతే, వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితమైంది, వ్యాక్సిన్‌లో హానికరమైన బ్యాక్టీరీయా ఉన్నదా లేదా అని తెలుసుకోవడం మరో ఎత్తు. దీనికోసం ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తన నిధులను ఖర్చు చేస్తుంటాయి. వ్యాక్సిన్ సురక్షితమా కాదా అనే అంశాన్ని పీతల రక్తంతో మాత్రమే పరీక్షించినపుడు మాత్రమే తెలుస్తుంది.…