ఈరోజుల్లో దేశంలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేస్తుండటంతో పాటు మగవారితో సమానంగా సంపాదిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం రావడంతో మహిళలు తమకు నచ్చిన వ్యక్తులను ఎంచుకొని వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో దేశంలో పెళ్లికాకుండా మిగిలిపోతున్న పురుషుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఒక్కపెళ్లి కోసమే చాలా మంది ఎదురుచూస్తుంటే, ఒడిశాకు చెందిన బిధు ప్రకాశ్ స్వైన్ అనే వ్యక్తి 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందరూ కలిసి ఉంటారా అంటే లేదు. ఒకరికి తెలియకుండా మరోకరిని వివాహం చేసుకున్నాడు. చివరకు బండారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు.
Read: Semi Conductors : ఇజ్రాయిల్ కంపెనీని టేకోవర్ చేసుకున్న ఇంటెల్…
ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందిన బిధు ప్రకాశ్ స్వైన్ అనే వ్యక్తి డాక్టర్ గా చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాల్లోని మహిళలను వివాహం చేసుకున్నాడు. పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలను డాక్టర్ పేరుతో నమ్మించి మ్యాట్రిమోనియల్ ద్వారా వివాహం చేసుకున్నాడు. డైవర్స్ తీసుకున్న ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని వారిని వలలో వేసుకొని వివాహం చేసుకుంటారు. ఇటీవలే ఢిల్లీకి చెందిన ఓ టీచర్‌ను ఇలానే ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు కాపురం చేసిన తరువాత భువనేశ్వర్‌లో పని ఉందని చెప్పి వదిలేసి వెళ్లాడట. అనుమానం వచ్చిన మహిళ పోలీసులను సంప్రదించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బిధు ప్రకాశ్ స్వైన్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా షాకిచ్చే విషయాలు వెలుగులోని వచ్చాయి. తాను 13 మంది మహిళలను వివాహం చేసుకున్నట్టు ఒప్పుకున్నాడు. బిధు ప్రకాశ్ వివాహం చేసుకున్న మహిళల వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.