వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో పార్టీ పెడుతున్నారా? అంటూ మీడియా చిట్‌చాట్‌లో ఎదురైన ప్రశ్నకు స్పందించిన ఆమె.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? అంటూ వ్యాఖ్యానించి సంచలనానికి తెరలేపారు.. మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం.. పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తాం అన్నారు.. ఇక, ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు వైఎస్ షర్మిల.. రైతు ఆవేదన యాత్ర పేరుతో మరోసారి పాదయాత్రకు పూనుకుంటున్నారు.. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. పాదయాత్రకు అనుమతి లేదంటున్నారు పోలీసులు.. అయితే, నిబంధనల ప్రకారం తాము వెళ్తామని చెప్పినా అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు షర్మిల…
Read Also: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్..
మరోవైపు.. రైతు బంధు పండుగలకు మాత్రం నిబంధనలు అడ్డురావు అంటూ తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు వైఎస్ షర్మిల… ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు అడ్డువస్తాయన్న ఆమె.. బీజేపీ, కేసీఆర్ దొందు దొందే అంటూ మండిపడ్డారు.. ఇష్యూ డైవర్ట్ చేసేందుకు బీజేపీని ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా చెబుతూ.. ముందుకు సాగుతోన్న సంగతి తెలిసిందే. కానీ, ఏపీలో రాజకీయ పార్టీ పెట్టకూడదనే రూల్ ఏం లేదు కదా? అంటూ ఆమె ఇప్పుడు చేసిన వ్యాఖ్యల్లో ఆంధ్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి.