రిటైర్మెంట్‌ ప్రకటించిన పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్..

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు బిగ్‌ షాక్‌ తగిలింది… జట్టులో స్టార్‌ ప్లేయర్‌గా ఉన్న హఫీజ్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించారు.. ఆయన వయస్సు 41 ఏళ్లు.. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగట్రేం చేసిన మహ్మద్‌ హఫీజ్‌.. ఆల్‌రౌండర్‌ షోతో.. పాకిస్థాన్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.. ఇక, 2018లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌చెప్పిన ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల పాటు పాక్‌ జట్టుకు సేవలు అందించిన ఈ ఆల్‌రౌండర్‌.. రిటైర్మెంట్‌ ఆ జట్టుకు పెద్ద షాకే అంటున్నారు క్రికెట్‌ విశ్లేషకులు..

Read Also: ర్యాగింగ్‌ కలకలం.. సీరియస్‌గా స్పందించిన మంత్రి హరీష్‌రావు

ఇప్పటి వరకు పాకిస్థాన్‌ జట్టు తరపున 55 టెస్ట్‌లు, 218 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన మహ్మద్‌ హఫీజ్.. తన కెరీర్‌లో 21 సెంచరీలు, 64 హాఫ్‌ సెంచరీలతో.. 12000 పైగా పరుగులు సాధించాడు. 2003లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హఫీజ్ 218 వన్డేలు ఆడి 11 సెంచరీలు, 38 అర్ధసెంచరీలతో సహా 6,614 పరుగులు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 139 వికెట్లు తీశాడు.. 119 టీ20ల్లో 2514 పరుగులు చేసి 61 వికెట్లు తీశాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం ఆట కొనసాగించనున్నాడు హాఫీజ్‌. ఇక, హఫీజ్ టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌ తరపున గత ఏడాది చివరి మ్యాచ్‌ ఆడాడు.. యూఏఈలో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles