గత వారం విరాట్ కోహ్లీ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. అయితే టీ20 ఫార్మాట్లో నాయకునిగా తప్పుకున్న కోహ్లీ వన్డే ఫార్మాట్ లో కెప్టెన్ గా కొనసాగాలని అనుకున్నాడు. కానీ వైట్ బల్ ఫార్మాట్ లలో ఇద్దరు కెప్టెన్లు వద్దు అని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో బీసీసీఐ పై విరాట్ కోహ్లీ కోపంగా ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి సిద్ధమైన టీం ఇండియా… ఆ తర్వాత అక్కడ వన్డే సిరీస్ కూడా ఆడనుంది. కానీ ఈ సిరీస్ కు విరాట్ దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
Read Also : సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ నుండి రోహిత్ ఔట్… ఆ స్థానంలో..?
అయితే రోహిత్ శర్మ తో విరాట్ కోహ్లీకి ఈ మధ్య బాగా గ్యాప్ పెరిగిందని… అందుకే వన్డే మ్యాచ్ లకు కోహ్లీ దూరమవుతున్నట్లు సమాచారం. కానీ వ్యక్తిగత కారణాలతో వన్డేలకు అందుబాటులో ఉండను అని కోహ్లీ బీసీసీఐ చెప్పాడు అని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీం ఇండియా మొదట ఆడనున్న టెస్ట్ సిరీస్ కు గాయం కారణంగా రోహిత్ శర్మ దూరమయ్యాడు. దాంతో… కోహ్లీ కెప్టెన్ గా ఉన్న టెస్టులకు రోహిత్ శర్మ…. రోహిత్ కెప్టెన్ గా ఉన్న వన్డే లకు కోహ్లీ దూరం కావడంతో ఈ ఇద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదరలేదు అనేది అర్ధమవుతుంది. ఇక కోహ్లీ వన్డేలకు దూరం అవుతున్నట్లు బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.