2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ట్రంప్ తనను అత్యాచారం చేశాడంటూ అమెరికా జర్నలిస్ట్ సంచలన ఆరోపణ చేసింది. అమెరికన్ జర్నలిస్ట్, మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్ 1996లో ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సివిల్ వివాదంపై మాన్‌హాటన్‌లోని US ఫెడరల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మాన్‌హాటన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తనపై లైంగికంగా వేధింపులకు గురిచేశాడని జీన్ కారోల్ చెప్పారు.
Also Read:YS Viveka Case: వైఎస్ వివేకా కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
కారోల్ మాట్లాడుతూ.. “1996లో ట్రంప్ మాన్ హట్టన్ లోని ఓ డిపార్ట్ మెంట్ స్టోర్ లో కారోల్ ను కలిశారు. మరో మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వడంపై ఆయన సలహా అడగగా.. ట్రంప్ సరదాగా అంగీకరించి ఆమె డిపార్ట్ మెంట్ స్టోర్ లోని ఆరో అంతస్తులోకి వెళ్లారు. ఆ సమయంలో ఆ సెక్షన్‌లో ఎవరూ లేరు.. దుస్తులు మార్చుకునే గదిలోకి వచ్చిన ట్రంప్.. తలుపులు వేసి గోడకు బలంగా తోసాడు.. ఆమె తలకు తగిలేలా బలంగా తోసాడు. డొనాల్డ్ ట్రంప్ నన్ను లైంగికంగా వేధింపులకు గురి చేసినందున నేను ఇక్కడ ఉన్నాను, నేను దాని గురించి వ్రాసినప్పుడు, అది జరగలేదని అతను చెప్పాడు. నా ప్రతిష్టను నాశనం చేశాడు, నా జీవితాన్ని తిరిగి పొందడానికి నేను ఇక్కడ ఉన్నాను” వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన కరోల్.. తనను అత్యాచార బాధితురాలిగా చూడలేకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపింది.
Also Read:Today Business Headlines 27-04-23: అదిరిపోయే కానుక.. అంబానీనా మజాకా. మరిన్ని వార్తలు.
రెండు దశాబ్దాల కిందటే జరిగిన ఈ ఘటనపై ముగ్గురు మహిళలతో కూడిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. మరోవైపు, ఈ కేసులో ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ ఖండించారు. ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గత ఏడాది కారోల్ తన పుస్తకంలో ఆరోపించింది. అయితే ఆ పుస్తకాన్ని అమ్మేందుకే తాను ఈ కల్పనను సృష్టించానని ట్రంప్ పరువు నష్టం కేసు వేశారు. తానేమీ తప్పు చేయలేదని, ఇది విస్తృత రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగమని ఆయన సమర్థించారు. ట్రంప్‌పై కారోల్ విద్వేషపూరిత వాగ్దానాలు చేస్తున్నారని ఆయన అన్నారు. లైంగిక వేధింపులు నిజమైతే, ఇన్నాళ్లూ ఎందుకు బయటపెట్టలేదు? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే, 2016 ఎన్నికల సమయంలో పోర్న్ స్టార్‌తో శారీరక సంబంధం పెట్టుకోకుండా ట్రంప్‌తో అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.