Karnataka polls: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు.. అమిత్ షాపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ భగ్గుమంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కోరారు. ఒక సామాన్యుడు చేసి ఉంటే అరెస్ట్ చేసి ఉండేవారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్నారు. అమిత్ షా దేశానికి హోంమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కాదు అని చెప్పారు. తనపై 20కి పైగా కేసులు పెట్టారని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని చెప్పారు.
Also Read:Sudan Crisis: సూడాన్‌లో సంక్షోభం… కాల్పుల విరమణ పొడిగింపుకు ప్రాథమిక ఆమోదం
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు. బెళగావి జిల్లా తెర్డాల్‌లో జరిగిన ప్రచార సభలో షా మాట్లాడారు. కర్ణాటకలో బుజ్జగింపు రాజకీయాలను మాత్రమే తీసుకువస్తామని కాంగ్రెస్, హోంమంత్రి జనాలకు చెప్పారు. బిజెపిని ఎన్నుకోకపోతే అభివృద్ధి రివర్స్ గేర్ లోకి వెళ్తుందని హెచ్చరించారు. బీజేపీ మాత్రమే రాష్ట్రాన్ని కొత్త కర్ణాటక వైపు నడిపించగలదని షా పేర్కొన్నారు. మే 10న కర్ణాటకలో ఓటింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!